ఇసుక ధరలకు కళ్లెం వేయాలని సీఎం జగన్‌ నిర్ణయం

ఇసుక ధరలకు కళ్లెం వేయాలని సీఎం జగన్‌ నిర్ణయం
x
Highlights

ఇసుక ధరలకు కళ్లెం వేయాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ధరల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. ఈ మేరకు ఆర్డినెన్స్‌ సిద్ధం చేయాలని అధికారులకు...

ఇసుక ధరలకు కళ్లెం వేయాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ధరల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. ఈ మేరకు ఆర్డినెన్స్‌ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఇసుక ధరలు నిర్ణయించాలని జిల్లా కలెక్టర్లకు, గనులశాఖ అధికారులకు సీఎం జగన్‌ ఆదేశించారు. జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఎంత రేటు పెట్టాలో కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయించాలని అధికారులకు జగన్‌ సూచించారు. ఇసుక ఎక్కువ ధరకు అమ్మితే జైలుకు పంపేలా చట్టం తీసుకురావాలని ఆదేశించారు సీఎం జగన్‌.

ఇసుక రేటు నిర్ణయించాకే ధరలను ప్రకటించాలని సీఎం జగన్‌ అన్నారు. నిర్ణయించిన ధరలు ప్రజలకు అర్ధమయ్యేలా కలెక్టర్లు ప్రచారం చేయాలని, వచ్చే వారం స్పందన కార్యక్రమం నాటికి రేట్లు, టోల్‌ ఫ్రీ నంబర్‌ ప్రకటించాలన్నారు. వచ్చే వారం స్పందన కార్యక్రమం కేవలం ఇసుక సమస్యపైనే నిర్వహిస్తామన్నారు. "స్పందన" కార్యక్రమంలో ఇసుక వారోత్సవం తేదీలు ప్రకటిస్తామని సీఎం జగన్‌ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories