జిల్లాల పునర్విభజనపై సీఎం జగన్ సమీక్ష
జిల్లాల పునర్విభజనపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాల పునర్విభజనపై ఇప్పటికే సీఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీకి నాలుగు సబ్ కమిటీలు ఏర్పాటు చేసింది సర్కార్. జిల్లాల పునర్విభజనపై కమిటీలు దాదాపు అధ్యాయనం కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తామని జగన్ హామీ ఇచ్చిన మేరకు 25 నుంచి 26 జిల్లాలను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి నాటికి కొత్త జిల్లాలు దాదాపు ఏర్పాటు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Next Story




