కొత్తజిల్లాలపై ముగిసిన సీఎం జగన్ సమీక్ష

Andhra Pradesh: ఏప్రిల్‌ 4న కొత్త జిల్లాల ప్రకటన

Rama Rao
Updated on: 30 March 2022 6:45 PM IST
CM Jagan Review on New Districts | AP News Today
X

కొత్తజిల్లాలపై ముగిసిన సీఎం జగన్ సమీక్ష

Andhra Pradesh: కొత్తజిల్లాలపై సీఎం జగన్ సమీక్ష ముగిసింది. జిల్లా పునర్‌వ్యవస్థీకరణకు సీఎం ఆమోదం తెలిపారు. ఏప్రిల్‌ 4న ఉదయం 9.05 నుంచి 9.45లమధ్య జిల్లాల అవతరణ జరుగనుంది. జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి 16,600 సలహాలు, అభ్యంతరాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. వాటన్నింటిని పరిగణలోకి తీసుకోని మార్పులు, చేర్పులు చేశారు. జిల్లాల ఏర్పాటు కోసం అధికారులకు సీఎం పలు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో ఆఫీసుల భవనాల నిర్మాణం కోసం స్థలాలు సేకరించాలని ఆదేశించారు. అలాగే నిర్మాణాలు పదికాలాల పాటుగుర్తిండేలా ఉండాలని సీఎం ఆదేశించారు.

Rama Rao

Rama Rao

Next Story