CM Jagan: గృహనిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష

CM Jagan: ఇళ్ల స్థలాల పంపిణీ, టిడ్కో ఇళ్లపై చర్చ

Rama Rao
Published on: 26 Oct 2022 4:10 PM IST
CM Jagan Review on Housing Department | AP News
X

CM Jagan: గృహనిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష

CM Jagan: గృహనిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. జగనన్న కాలనీలు, ఇళ్ల స్థలాల పంపిణీ, టిడ్కో ఇళ్లపై అధికారులతో కలిసి చర్చించారు. పలు నిర్మాణాల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. వర్షాలు తగ్గినందున వేగంగా పనులు ముందుకు సాగుతాయన్న అధికారులు.... 2022–23 ఆర్థిక సంవత్సరంలో గృహనిర్మాణం కోసం రూ.5 వేల 5 కోట్లు ఖర్చు చేశామన్నారు. విశాఖలో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. టిడ్కో ఇళ్ల నిర్వహణ బాగుండాలన్న సీఎం.... వాటిని పట్టించుకోకపోతే మురికి వాడలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Rama Rao

Rama Rao

Next Story