CM Jagan Review on Corona Situation: కరోనా కట్టడి విషయంలో ప్రతి అధికారి కష్టపడి పనిచేస్తున్నారు

CM Jagan Review on Corona Situation: కరోనా కట్టడి విషయంలో ప్రతి అధికారి కష్టపడి పనిచేస్తున్నారు
x
Highlights

CM Jagan review on corona situation: రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ స్పందన కార్యక్రమం...

CM Jagan review on corona situation: రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ రాష్ట్రంలోని ప్రతి అధికారి సీరియస్‌గా పనిచేస్తున్నారని సీఎం జగన్‌ అన్నారు. ఇవాళ 6 వేలకుపైగా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్తున్నారు. కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్నా రిపోర్టుల్లో తగ్గించి చూపే ప్రయత్నం చేయడంలేదని స్పష్టం చేశారు. దేశంలోనే రోజుకు 50వేలకు పైగా టెస్టులు చేస్తున్న రాష్ట్రం మనదేనని సీఎం వ్యాఖ్యానించారు. దాదాపు ప్రతి మిలియన్‌కూ 31వేలకు పైగా టెస్టులు చేస్తున్నామని తెలిపారు. కొవిడ్ వస్తుంది, పోతుంది ఇప్పటి పరిస్థితుల్లో కొవిడ్ తో కలిసి జీవించక తప్పదని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.

మధ్యప్రదేశ్‌ సీఎంకూడా కరోనా వచ్చింది. కరోనా రావడమన్నది పాపం కాదు.. నేరం కాదు. కరోనా కారణంగా చనిపోయిన వారి నుంచి...వైరస్ వ్యాపించకుండా చేయాల్సినవన్నీ చేస్తున్నాం. చనిపోయినవారిలో కొన్ని గంటల తర్వాత వైరస్‌ ఉండదు. బంధువులకు కూడా మనం అంత్యక్రియలు చేయకపోవడం విచారకరం. మానవత్వమే మరగున పడుతున్న పరిస్థితులను చూస్తున్నాం. కరోనా కారణంగా చనిపోయిన వారి అంత్యక్రియలకు రూ.15 వేలు అందిస్తున్నాం. రాష్ట్రంలో లక్షకు పైగా కేసులు నమోదైనా.. సగం మందికి నయమైందని తెలిపారు. దేశంలో కరోనా మరణాల రేటు 2.5శాతంగా ఉంటే రాష్ట్రంలో 1.06 శాతమని వివరించారు. 85 శాతం మందికి ఇళ్లలోనే నయమైందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కరోనాపై ఎవరికీ భయాందోళనలు ఉండకూడదన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories