క్రికెట్‌లో కెప్టెన్ ఒక్కడు ఏమి చెయ్యలేడు, మంచి టీం ఉండాలి: సీఎం జగన్

X
Highlights
క్రికెట్‌లో కెప్టెన్ ఒక్కడు ఏమి చెయ్యలేడని మంచి టీం ఉండాలన్నారు ఏపీ సీఎం జగన్. ప్రస్తుతం ఏపీలో 20 నెలల పాలన...
Arun Chilukuri11 Feb 2021 12:40 PM GMT
క్రికెట్‌లో కెప్టెన్ ఒక్కడు ఏమి చెయ్యలేడని మంచి టీం ఉండాలన్నారు ఏపీ సీఎం జగన్. ప్రస్తుతం ఏపీలో 20 నెలల పాలన పూర్తి అయిందని ఇప్పుడు మిడిల్ ఓవర్‌లో ఉన్నామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ పథకాలు గ్రామ స్థాయికి వెళ్లే వరకు అధికారులు కృషి చేయాలని సూచించారు. అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన సీఎం జగన్ వాలంటరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని అభినందించారు. స్వచ్ఛంద సేవలకు ప్రతి ఏడాది ఉగాది రోజు అవార్డులను ఇవ్వాలన్నారు. ఈ ఏడాది నుంచి ఈ కార్యక్రమాలు మొదలు కావాలని జగన్ సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు అజేయ కల్లం, నీలం సాహ్ని, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Web TitleCM Jagan review meeting with govt officials
Next Story