ఉత్తరాంధ్రలో తుఫాన్ పరిస్థితులపై కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్ సమీక్ష

CM Jagan: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశం

Sandeep Eggoju
Updated on: 2 Dec 2021 1:14 PM IST
CM Jagan Review Meeting with Collectors on Uttarandhra Cyclone Conditions
X

ఉత్తరాంధ్ర తుఫాన్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష (ఫైల్ ఇమేజ్)

CM Jagan: ఉత్తరాంధ్రలో తుఫాన్ పరిస్థితులపై కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయ శిబిరాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు సీఎం జగన్. లోతట్టు, ముంపు ప్రాంతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలన్న సీఎం తుఫాన్ పరిస్థితులతో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండ చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాన్ సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు ముగ్గురు సీనియర్ అధికారులను నియమించారు. తుఫాన్ సహాయ కార్యక్రమాల సమన్వయం, పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించాలని సీఎం జగన్ ఆదేశించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story