మహిళాలకు సీఎం జగన్‌ బంపర్‌ ఆఫర్‌

మహిళాలకు సీఎం జగన్‌ బంపర్‌ ఆఫర్‌
x

మహిళాలకు సీఎం జగన్‌ బంపర్‌ ఆఫర్‌

Highlights

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు సీఎం జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దిశ యాప్‌ను...

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు సీఎం జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్‌ కోడ్‌తో 2000 స్టాండ్‌లు ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు. మహిళా దినోత్సవం రోజున స్మార్ట్ ఫోన్లు కొనే మహిళలకు 10శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇక మహిళా భద్రత, సాధికారితపై షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. దిశ పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టనుంది. కాలేజీల్లో దిశపై ప్రచార హోర్డింగులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. హోర్డింగుల్లో దిశ యాప్‌ సహా అన్ని రకాల వివరాలు ఉంచాలని సీఎం ఆదేశించారు.

దిశ కింద తీసుకుంటున్న చర్యల అవగాహన కోసం విస్తృతంగా ప్రచారం చేయాలని జగన్ ఆదేశించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మార్చి 7న క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి వింగ్‌ నుంచి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు సత్కారం చేయాలన్నారు. పోలీసు డిపార్ట్‌మెంటులో పనిచేస్తున్న మహిళలందరికీ ఆరోజు స్పెషల్‌ డే ఆఫ్‌గా ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. అదనంగా మహిళా ఉద్యోగులకు 5 క్యాజువల్‌ లీవ్స్‌ ఇచ్చేందుకు సీఎం జగన్‌ అంగీకారం తెలిపారు. నాన్‌ గెజిటెడ్‌ మహిళా ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం తరఫున రూ.5లక్షలు ఇవ్వనున్నట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు. చేయూత కిరాణా దుకాణాల్లో అందుబాటులో శానిటరీ పాడ్స్‌, దానికోసం సెర్ప్, మెప్మా, హెచ్‌ఎల్‌ఎల్‌ మధ్య ఎంఓయూ చేసుకోవాలని ఆధికారులను ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories