CM Jagan: నెల్లూరు, చిత్తూరు, కడపలో వర్షాలపై సీఎం సమీక్ష
CM Jagan: కలెక్టర్లతో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్
ఏపీలో కురుస్తున్న వర్షాలపై సీఎం జగన్ సమీక్ష (ఫైల్ ఇమేజ్)
CM Jagan: ఏపీలో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో జగన్ మాట్లాడారు. సహాయక చర్యల కోసం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరం అయితే చోటా శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలను తరలించాలన్నారు సీఎం జగన్. అలాగే, శిబిరాల్లో ఉన్న వారికి ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయల సాయం ప్రకటించారు. వరద సహాయక చర్యల కోసం కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో వైద్య ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు.
Next Story




