హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఏపీ ప్రభుత్వం

X
Highlights
తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ సీనియర్లు, న్యాయ నిపుణులతో సీఎం జగన్...
Arun Chilukuri21 Jan 2021 7:50 AM GMT
తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ సీనియర్లు, న్యాయ నిపుణులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్న ప్రభుత్వం న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని గురువారం హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.
Web Titlecm jagan review meeting on high court decision
Next Story