Cylone Gulab: మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం

Cylone Gulab: గులాబ్‌ తుపాను, అనంతర పరిస్థితులపై ఏపీ సీఎం జగన్ కీలక సమీక్ష నిర్వహించారు.

Arun Chilukuri
Published on: 27 Sept 2021 4:30 PM IST
Cylone Gulab: మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం
X

Cylone Gulab: మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం

Cylone Gulab: గులాబ్‌ తుపాను, అనంతర పరిస్థితులపై ఏపీ సీఎం జగన్ కీలక సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికారులతో వర్చువల్‌గా భేటీ అయ్యారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్షించిన సీఎం జగన్‌కు తుపాను అనంతర పరిస్థితులను సీఎస్‌ ఆదిత్య నాథ్‌ దాస్‌ వివరించారు.

అనంతరం సీఎం మాట్లాడుతూ.. వర్షం తగ్గగానే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అరగంటకూ విద్యుత్‌ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తెచ్చుకోవాలని సూచించారు. ఇదే సమయంలో గులాబ్ కారణంగా ఏ ఒక్కరు మరిణించినా వారి కుటుంబాలకు ఐదు లక్షల ఆర్థిక సాయం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే, పునరావాస కేంద్రాలకు వచ్చే బాధితులకు వెంటనే వెయ్యి రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story