మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలో కొత్త పథకం

Arun Chilukuri
Published on: 5 March 2021 8:04 PM IST
మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలో కొత్త పథకం
X

మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలో కొత్త పథకం

ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 7 నుంచి 12 తరగతి విద్యార్ధినులకు శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఉచిత శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ పథకం ప్రారంభించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

ఏప్రిల్ 15 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సీఎం వివరించారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి ప్రభుత్వ స్కూల్స్, జూనియర్‌ కళాశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థినిలకు శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. జూలై 1 నుంచి ప్రతినెలా ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ నేప్‌కిన్స్‌ను ప్రభుత్వం‌ పంపిణీ చేస్తుందన్నారు. ఇందు కోసం సుమారు రూ. 41.4 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story