ఏపీ ప్రభుత్వానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బిగ్ షాక్..

ఏపీ ప్రభుత్వానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బిగ్ షాక్..
x
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి
Highlights

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చింది.

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చింది. నిరాధార వార్తలను రాసే వార్త సంస్థలపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జిఓ నెంబర్ 2430 ను రద్దు చేయాలని కౌన్సిల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిఓను వెంటనే ఉపసంహరించుకోవాలని జగన్ ప్రభుత్వాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఎపిడబ్ల్యుజె) తరపున సురేష్ హాజరయ్యారు. అదనపు డైరెక్టర్ కిరణ్ మరియు ప్రభుత్వం తరపున జిఓ 2430 పై తమ సమస్యలను తెలియజేశారు.ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ ప్రసాద్ ఈ జీవోను రద్దు చెయ్యాలని ఆదేశించారు..

కాగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచురించడం లేదా ప్రసారం చేయడంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం శాఖ కార్యదర్శికి ఆర్డినెన్సులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తే పరువు నష్టం కింద నోటీసులు జారీ చేయడానికి కార్యదర్శులకు అధికారం ఇచ్చింది. ప్రాజెక్టులపై ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వక కథనాలను రూపొందిస్తున్నాయని జగన్ దృష్టికి రావడంతో అట్టి వార్తా సంస్థలపై చర్యలు తీసుకోవాలని సీఎం నిర్ణయించారు. అయితే తాజా ఆదేశాలతో ఇప్పుడు ఈ జిఓను ఏపీ ప్రభుత్వం రద్దు చేయాల్సి ఉన్న తరుణంలో.. ప్రభుత్వం దానిపై ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తిగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories