CM Jagan: సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్‌ దంపతులు

CM Jagan Participates Sankranti 2023 Celebrations
x

CM Jagan: సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్‌ దంపతులు

Highlights

CM Jagan: సీఎం జగన్ నివాసంలో సంక్రాంతి సంబరాలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ నివాసంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తాడేపల్లిలోని నివాసం వద్ద ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్ తన సతీమణి భారతీతో కలిసి పాల్గొన్నారు. సీఎం జగన్‌ దంపతులు ముందుగా జ్యోతిని వెలిగించి సంక్రాంతి సంబరాల్ని ప్రారంభించారు. అనంతరం గోశాలలో గోపూజ చేశారు. ఆపై భోగి మంటను వెలిగించిన సీఎం జగన్‌.. హరిదాసు కీర్తనలు ఆలకించి ఆశీర్వాదం తీసుకున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా సీఎం జగన్‌ ఇంటి ఆవరణలో భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ సామగ్రి, ఎడ్ల బండ్లు, గడ్డి వాములు, పశుసంపద, కుల వృత్తుల చిత్రాలతో పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories