Andhra Pradesh Formation Day: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సిఎం జగన్!

Andhra Pradesh Formation Day: ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

K V D Varma
Updated on: 3 Nov 2020 11:37 AM IST
Andhra Pradesh Formation Day: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సిఎం జగన్!
X

Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఉదయం 9.00 గంటలకు తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీస్‌లో జరిగే కార్యక్రమానికి హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు 'మా తెలుగు తల్లికి' గీతాలాపన అనంతరం జాతీయ పతాకం ఎగురేశారు. అనంతరం తెలుగు తల్లికి, అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక ఆయా జిల్లాల్లో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జిల్లా మంత్రులు అందుబాటులో లేకపోతే జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రులు ఆయా జిల్లాల్లో జాతీయ జెండా ఎగరేశారు.

K V D Varma

K V D Varma

Next Story