గురునానక్ జయంతి వేడుకల్లో సీఎం జగన్

X
Highlights
విజయవాడలోని గురుద్వార్‌ను సీఎం జగన్ సందర్శించారు. గురుపూరబ్ ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు...
Arun Chilukuri30 Nov 2020 1:36 PM GMT
విజయవాడలోని గురుద్వార్‌ను సీఎం జగన్ సందర్శించారు. గురుపూరబ్ ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. గురుద్వార్‌కు వచ్చిన సీఎం జగన్‌కు శ్రీ గురుసింగ్ సహధర్మ ప్రచార్ కమిటీ ఘనస్వాగతం పలికింది. ప్రత్యేక పూజల అనంతరం సీఎంకు గురద్వార్ పరిసరాలను నిర్వాహకులు వివరించారు. నగరంలోని గురునానక్ కాలనీలోని గురుద్వార్‌లో గురునానక్ 551వ జయంతి వేడుకలు ఆదివారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఈ వేడుకల్లో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ప్రభుత్వ విప్ సామినేని ఉదయ భాను, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని ఆవినాష్, నగర అధ్యక్షుడు బొప్పన భవ కుమార్ పాల్గొన్నారు.
Web Titlecm Jagan participated in guru Nanak Jayanti celebrations Vijayawada
Next Story