క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌

Arun Chilukuri
Published on: 25 Dec 2019 11:52 AM IST
క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌
X
జగన్‌

కడప జిల్లా పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో సీఎం జగన్ క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబసభ్యులతో కలిసి క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్‌ విజయమ్మ, సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి కూడా క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌, విజయమ్మ, వైఎస్‌ భారతి ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌, విజయమ్మ కేక్‌ కట్‌ చేశారు. నూతన సంవత్సర క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రులు ఆదిమూలపు సరేష్‌, అవంతి శ్రీనివాస్‌, వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story