వేల్పులలో సచివాలయ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన జగన్

CM Jagan: సచివాలయ కాంప్లెక్స్‌ సముదాయాన్ని పరిశీలించిన సీఎం

Jyothi
Published on: 2 Sept 2022 6:36 AM IST
CM Jagan Opens Velpula Sachivalayam In Kadapa District
X

వేల్పులలో సచివాలయ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన జగన్

CM Jagan: కడప జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం సొంత నియోజకవర్గం వేముల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామ సచివాలయ కాంప్లెక్స్ ను సీఎం ప్రారంభించారు. సచివాలయ కాంప్లెక్స్‌ సముదాయాన్ని పరిశీలించిన సీఎం జగన్.. కాసేపు సచివాలయ సిబ్బందితో ముచ్చటించారు. ప్రజలకు అందిస్తున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం వైఎస్సార్ ఘాట్ సందర్శించనున్నారు. దివంగత వైఎస్సార్ వర్దంతి సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొననున్నారు.

Jyothi

Jyothi

Next Story