CM Jagan: పాలన నుంచి పొలిటికల్ ట్రాక్‌లోకి సీఎం జగన్

CM Jagan: పాలన నుంచి పొలిటికల్ ట్రాక్‌లోకి సీఎం జగన్

Rama Rao
Updated on: 9 March 2022 9:31 AM IST
CM Jagan on the Political Track from the Regime | AP News Today
X

పాలన నుంచి పొలిటికల్ ట్రాక్‌లోకి సీఎం జగన్

CM Jagan: వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జనంలోకి తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని గుర్తుచేస్తున్నారు వైసీపీ బాస్. వచ్చే ఎన్నికలకు ఇప్పట్నుంచి సమాయత్తం అయ్యే పనిలో జగన్ ఉన్నారా. తాజా పరిణామాలు ఇలాగే ఉన్నాయి. ఏడాదిన్నర పాటు పూర్తి స్థాయిలో జనం లో ఉండాలని సీఎం జగన్ ఎమ్మెల్యే లు మంత్రుల కు దిశా నిర్దేశం చేయ్యబోతున్నారు.వైసీపీ 150కి పైగా ఎమ్మెల్యే లను గెలిచింది. ఇది చిన్న విషయం కాదు కానీ వీళ్ళని నిలబెట్టుకోవలంటే మాత్రం చాలా కష్టపడాలి ప్రస్తుతం సీఎం జగన్ ఇదే పనిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే లు కీలక పాత్ర పోషించాలి అని జగన్ చెప్పబోతున్నారు

త్వరలోనే వైసిపి ఎమ్మెల్యే లు అందరితో ప్రత్యేకంగా సీఎం జగన్ సమావేశం అవ్వబోతున్నారు. బహుశా కొద్దీ రోజుల్లోనే ఈ మీటింగ్ ఉండచ్చు. ప్రతి ఎమ్మెల్యే వారి నియోజకవర్గంలో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అన్ని వివరించాలి. ప్రభుత్వం చేసే కార్యక్రమాల తో పాటు వైసిపి మేనిఫెస్టో అమలు అయిన విధానం గత ప్రభుత్వాలు మ్యానిఫెస్టో విషయంలో అమలు చేసిన పద్ధతి ఇవన్నీ ఎమ్మెల్యే లు జనం లోకి తీసుకు వెళ్లాలని సీఎం ఎమ్మెల్యే లకు చెప్పనున్నారు.

వచ్చే రెండేళ్లు చాలా కీలకంగా జగన్ తీసుకున్నారు. ప్రతి క్షణం జనం లోనే ఉండాలని మంత్రులు ఎమ్మెల్యే లు ఇతర ప్రజా ప్రతినిధులకు సీఎం సూచనలు ఇవ్వనున్నారు. అసెంబ్లీ సమావేశాలు తర్వాత చాలా ముఖ్యమైన సమయం గా వైసిపి భావిస్తోంది. వచ్చే జులై లో వైసిపి ప్లీనరీ జరగనుంది. ఈ లోపు అనుబంధ సంఘాల కొత్త జిల్లాల ఏర్పాటు నామినేటెడ్ పదవులు ఇలా అన్నిటి పై దృష్టి పెట్టి వచ్చే ఎన్నికలకు రెడీ అవ్వనున్నారు జగన్.

Rama Rao

Rama Rao

Next Story