CM Jagan: దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం జగన్
CM Jagan: సరస్వతి అవతారంలో దర్శనం ఇస్తున్న దుర్గమ్మ
విజయవాడ కనకదుర్గమ్మ కు పట్టు వస్రాలు సమర్పించిన జగన్
CM Jagan: ఏపీ సీఎం జగన్ బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు సీఎంకు స్వాగతం పలికారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూలా నక్షత్రం సందర్భంగా కనకదుర్గమ్మకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, పసుపుస, కుంకుమలను సీఎం సమర్పించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు సీఎం జగన్ కు పరివట్టం కట్టి తలపాగా చుట్టారు. పట్టువస్త్రాలను తలపై పెట్టగా వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల మధ్య సీఎం జగన్ కానక దుర్గమ్మ సన్నిధికి చేరకున్నారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు సీఎం జగన్ కు తీర్ధ ప్రసాదాలు అందచేసి ఆశీర్వదించారు.
Next Story




