Tirumala: శ్రీవారిని దర్శించుకున్న​ సీఎం జగన్‌

Tirumala: సీఎం జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

Arun Chilukuri
Published on: 19 Sept 2023 9:17 AM IST
CM Jagan Offer Prayers at Tirumala Tirupati Temple
X

Tirumala: శ్రీవారిని దర్శించుకున్న​ సీఎం జగన్‌

Tirumala: సీఎం జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్... టీటీడీ పాలకమండలి ఛైర్మన్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ఈవో ధ‌ర్మారెడ్డి.. శ్రీవారి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.

అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి...శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి స్వామి వారి శేషవస్త్రంతో సీఎంను సత్కరించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి వేంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొట్టు సత్యనారాయణ, రోజాతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story