CM Jagan: సీఎం జగన్ మలివిడత ఎన్నికల ప్రచారం
CM Jagan: రెండో రోజు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ సభలు
CM Jagan: సీఎం జగన్ మలివిడత ఎన్నికల ప్రచారం
CM Jagan: ఏపీ సీఎం జగన్ మలివిడత ఎన్నికల ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టారు. ఏపీలోని మెజారిటీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోజుకు మూడు బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తున్నారు. 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్‌ను ఇప్పటికే వైసీపీ నేతలు ఖరారు చేశారు. తొలిరోజు అనంతపురం జిల్లా, తిరుపతి, నెల్లూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ ఈరోజు అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కాసేపట్లో అనకాపల్లి జిల్లా చోడవరంలో నిర్వహించే బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12గంటల 30నిమిషాలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరంలో జరిగే సభలో పాల్గొని మాట్లాడతారు. సాయంత్రం 3గంటలకు గుంటూరు జిల్లా పొన్నూరు సభల్లో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. బహిరంగ సభల్లో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల తరపున సీఎం జగన్ ప్రచారం నిర్వహిస్తారు.




