CM Jagan: కుప్పంలో భరత్‌ను గెలిపిస్తే.. మంత్రి పదవి

CM Jagan: కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానం

Jyothi
Published on: 5 Aug 2022 6:59 AM IST
CM Jagan Met With YCP Workers of Kuppam Constituency
X

CM Jagan: కుప్పంలో భరత్‌ను గెలిపిస్తే.. మంత్రి పదవి 

CM Jagan: కుప్పం ప్రాంత పరిసరాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వైసీపీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ ప్రతినిధులతో ప్రాంతాలవారీగా సమావేశకావాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తొలిసారిగా కుప్పం నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. కుప్పం తన సొంత నియోజకవర్గంతో సమానంగా చూసుకుంటామన్నారు.

మూడేళ్లలో కుప్పం ప్రాంతంలో అభివృద్ధిపనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు హయాంలో కన్నా ప్రయోజనకరంగా తీర్చిదిద్దామన్నారు. ఎమ్మెల్సీ, వైసీపీ ఇన్ ఛార్జ్ భరత్ ను గెలిపిస్తే ఆప్రాంతాన్ని మరింత అభివృద్ధిచేసేందుకు బాధ్యతలను అప్పగిస్తామని పేర్కొన్నారు. కుప్పం మున్సిపాలిటీకి 65 కోట్ల రూపాయల విలువైన పనులు మంజూరు చేశామన్నారు. కుప్పం అభివృద్ధికి అన్ని వేళలా అండగా ఉంటామన్న సీఎం జగన్ 175కి 175 సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు.

Jyothi

Jyothi

Next Story