Jagan: మేమంతా సిద్ధం.. గురువరాజుపల్లె నుంచి సీఎం జగన్ బస్సుయాత్ర ప్రారంభం

Jagan: మల్లవరం, ఏర్పేడు, పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్‌ మీదుగా.. చిన్నసింగనమల చేరుకోనున్న 'మేమంతా సిద్ధం' బస్సుయాత్ర

Jyothi
Published on: 4 April 2024 8:02 AM IST
CM Jagan Memantha SiddamYatra at Chittoor District
X

Jagan: మేమంతా సిద్ధం.. గురువరాజుపల్లె నుంచి సీఎం జగన్ బస్సుయాత్ర ప్రారంభం 

Jagan: ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత సీఎం జగన్‌ మేమంతా సిద్ధం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రచారంలో ఆయన దూకుడు పెంచారు. మరోసారి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ఎన్నికల క్షేత్రంలోకి సీఎం జగన్ వెళ్తున్నారు.

చిత్తూరు జిల్లా రేణిగుంట గురువరాజు పల్లెలో 8వరోజు సీఎం జగన్ బస్సుయాత్ర ప్రారంభంకానుంది. మల్లవరం, ఏర్పేడు మీదుగా శ్రీకాళహస్తి బైపాస్ నుంచి సింగనమల మీదుగా బస్సు యాత్ర కొనసాగనుంది. ఉదయం 11 గంటలకు డ్రైవర్స్ అసోసియేషన్స్ సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించి...వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం 3గంటల 30నిమిషాలకు శ్రీకాళహస్తి మీదుగా బస్సు యాత్ర నాయుడుపేటకు చేరుకుంటుంది. సాయంత్రం నాయుడు పేటలో మేమంతా సిద్ధం బహిరంగ సభ జరగనుంది.

Jyothi

Jyothi

Next Story