logo
ఆంధ్రప్రదేశ్

గవర్నర్ బిశ్వభూషణ్‌తో ముగిసిన సీఎం జగన్ భేటీ

గవర్నర్ బిశ్వభూషణ్‌తో ముగిసిన సీఎం జగన్ భేటీ
X
Highlights

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ...

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, విగ్రహాల ధ్వంసంపై చర్చించారు. మతకల్లోలాలు రేపేలా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న రోజే ప్రజల దృష్టిమరల్చేందుకు విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతున్నారని సీఎం జగన్ వివరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అజెండాగా గవర్నర్ తో సీఎం జగన్ చర్చించినట్లు సమాచారం అందుతోంది. సుమారు 40 నిమిషాల పాటు ఇరువురు చర్చించారు. గవర్నర్‌తో భేటీ అనంతరం సీఎం జగన్‌ నేరుగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు.

Web TitleCM Jagan meets Governor
Next Story