CM Jagan: రైతుల మేలు కోసం మోటర్లకు మీటర్లు పెడతాం

CM Jagan: మీటర్లు పెడితేనే రైతులకు నాణ్యమైన విద్యుత్ అందుతుంది

Rama Rao
Published on: 21 Sept 2022 5:59 PM IST
CM Jagan Made Key Comments on Assembly | AP News
X

CM Jagan: రైతుల మేలు కోసం మోటర్లకు మీటర్లు పెడతాం

CM Jagan: రైతుల మోటర్లకు మీటర్లు పెడతామని అసెంబ్లీ సాక్షిగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. మోటర్లకు మీటర్లు పెడితేనే రైతులకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని అంతేకాదు మోటర్లు పాడవకుండా రైతులకు మేలు జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. రైతులకు మేలు చేసే కార్యక్రమం తమ ప్రభుత్వం చేస్తుంటే దీనిపై విపక్షాలు అనవసరపు రాద్దాంతం చేస్తున్నాయన్నారు. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టినా రైతుల దగ్గరి నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయబోమని సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదని ఇక ముందు కూడా వసూలు చేయబోమన్నారు ముఖ్యమంత్రి జగన్.

Rama Rao

Rama Rao

Next Story