9 ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం భూమి పూజ

Arun Chilukuri
Published on: 8 Jan 2021 3:28 PM IST
CM Jagan lays foundation stone for reconstruction of temples
X

ఏపీలో టీడీపీ హయాంలో తొలగించిన దేవాలయాల పునర్నిర్మాణానికి ఏపీ సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. విజయవాడలో పై వంతెన నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలో తొలగించిన దేవాలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఉదయం 11.01కి కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

పునర్నిర్మించే ఆలయాలు ఇవీ..

1. రాహు – కేతు ఆలయం

2. సీతమ్మ పాదాలు

3. దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం (సీతమ్మ పాదాలకు సమీపంలో)

4. శనైశ్చర ఆలయం

5. బొడ్డు బొమ్మ

6. ఆంజనేయస్వామి ఆలయం (దుర్గగుడి మెట్ల వద్ద)

7. సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయం

8. వీరబాబు ఆలయం (పోలీసు కంట్రోల్‌ రూమ్‌ సమీపంలో)

9. కనకదుర్గ నగర్‌లో శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం, గోశాల

Arun Chilukuri

Arun Chilukuri

Next Story