ఏపీలో టూరిజం కంట్రోల్‌ రూమ్‌లను ప్రారంభించిన సీఎం‌ జగన్‌

ఏపీలో టూరిజం కంట్రోల్‌ రూమ్‌లను ప్రారంభించిన సీఎం‌ జగన్‌
x
Highlights

రాష్ట్ర వ్యాప్తంగా నదీతీర ప్రాంతాల్లో సురక్షిత బోటింగ్‌ కోసం ఏపీ ప్రభుత్వం కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసింది. తాడిపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ...

రాష్ట్ర వ్యాప్తంగా నదీతీర ప్రాంతాల్లో సురక్షిత బోటింగ్‌ కోసం ఏపీ ప్రభుత్వం కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసింది. తాడిపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 9 కంట్రోల్‌రూమ్‌లను వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా ప్రారంభించారు సీఎం జగన్. అనంతరం కంట్రోల్‌ రూమ్స్‌ వద్దనున్న కలెక్టర్లను ఉద్దేశించి సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

నదీతీర పర్యాటక ప్రాంతాల్లో సురక్షిత బోటింగ్‌ కోసం కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేశామని సీఎం జగన్‌ తెలిపారు. బోటింగ్‌ ఆపరేషన్స్‌ను జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడూ పర్యవేక్షించాలని అన్నారు. కంట్రోల్‌ రూమ్‌లు నిబంధనలు పాటిస్తున్నాయా లేదా పరిశీలించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు అవంతి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories