ఇకపై ఏపీలో డోర్‌ తెరిస్తే రేషన్‌.. దేశంలోనే తొలిసారిగా వినూత్న విధానం

cm jagan launches ration door delivery vehicles
x
Highlights

ఇకపై ఏపీలో ఇంటి దగ్గరకే రేషన్‌ సరుకులు రానున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఈ వినూత్న విధానం చేపట్టింది వైసీపీ సర్కార్. ఇక దీనికి సంబంధించిన రేషన్‌ డోర్‌...

ఇకపై ఏపీలో ఇంటి దగ్గరకే రేషన్‌ సరుకులు రానున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఈ వినూత్న విధానం చేపట్టింది వైసీపీ సర్కార్. ఇక దీనికి సంబంధించిన రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను సీఎం జగన్‌ ప్రారంభించారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2వేల 500 రేషన్‌ వాహనాలను విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ దగ్గర ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు.

అదేవిధంగా మిగిలిన జిల్లాలకు కేటాయించిన వాహనాలను మంత్రులు ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నాణ్యమైన రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ కోసం 9వేల 260 వాహనాలు సిద్ధమయ్యాయి. లబ్ధిదారులకు నాణ్యమైన, మెరుగుపరచిన బియ్యాన్ని ఇంటిదగ్గరే అందచేసేందుకు ప్రతీఏడాది 830కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ పథకాన్ని రూపొందించింది ప్రభుత్వం.


Show Full Article
Print Article
Next Story
More Stories