ఫిషింగ్ హార్బర్లకు సీఎం జగన్ శంకుస్థాపన

X
Highlights
మత్స్యకారుల కోసం మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది ఏపీ సర్కార్. తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా...
Arun Chilukuri21 Nov 2020 7:00 AM GMT
మత్స్యకారుల కోసం మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది ఏపీ సర్కార్. తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న నాలుగు ఫిషింగ్ హార్బర్లకు సీఎం జగన్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. దీంతోపాటు 25 ఆక్వాహబ్‌ల నిర్మాణ పనులకు కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. మత్స్యకారుల జీవితాలు మార్చేందుకు ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామన్నారు. జనతా బజార్లలో నాణ్యమైన రొయ్యలు, చేపలను అందుబాటులోకి తెస్తామన్న సీఎం జగన్ మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడులో మరో 3 పోర్టుల నిర్మాణాన్ని చేపడుతామని తెలిపారు.
Web Titlecm Jagan laid the foundation for fishing harbors
Next Story