CM Jagan: విశాఖ రాజధాని కాబోతోంది.. నేను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతాను..

CM Jagan: నేను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతాను

Jyothi
Updated on: 31 Jan 2023 2:35 PM IST
CM Jagan Key Comments On Vizag
X

CM Jagan: విశాఖ రాజధాని కాబోతోంది

CM Jagan: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధాని కాబోతోందని త్వరలో తాను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతున్నట్లు చెప్పారు. ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ లో నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మార్చి 3,4వ తేదీల్లో విశాఖపట్నంలో ఇన్వెస్టర్ల సదస్సు జరగనుంది. మిమ్మల్ని విశాఖకు ఆహ్వానిస్తున్నామని.. విశాఖ రాజధాని కాబోతోందని.. కొన్ని నెలల్లో తాను కూడా అక్కడికే వెళ్లబోతున్నానని స్పష్టం చేశారు. మిమ్మల్ని మరోసారి విశాఖలో కలవాలని ఆకాంక్షిస్తున్నానని జగన్ వ్యాఖ్యానించారు.

Jyothi

Jyothi

Next Story