Atchannaidu: జగన్.. బీసీ ద్రోహి అంటూ అచ్చెన్న ఆగ్రహం..

Atchannaidu: 34వేల కోట్ల బీసీ నిధులను దారిమళ్లించిన బీసీ ద్రోహి సీఎం జగన్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Arun Chilukuri
Updated on: 26 Nov 2022 7:31 PM IST
CM Jagan is Against BC Says Atchannaidu
X

Atchannaidu: జగన్.. బీసీ ద్రోహి అంటూ అచ్చెన్న ఆగ్రహం..

Atchannaidu: 34వేల కోట్ల బీసీ నిధులను దారిమళ్లించిన బీసీ ద్రోహి సీఎం జగన్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కోత కోసి సుమారు 16,800 రాజ్యాంగబద్ద పదవులను బీసీలకు దూరం చేశారని ఆరోపించారు. బీసీల అనైన్డ్ భూములు 8వేల ఎకరాలు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారన్నారు. అంతేకాదు బీసీ భవనాలను నిలిపివేశారని...26 మంది బీసీ నేతల్ని హత్య చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

650 మంది బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా ఆధరణ పథకం రద్దు చేశారన్నారు. బీసీలకు విదేశీ విద్య, పెళ్లి కానుకలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేశారన్నారు. బీసీ వర్గానికి చెందిన జింకా వెంకట నరసయ్యను జగన్ రెడ్డి తాత హత్య చేసి, ఆయన బైరైటీస్ గనిని దురాక్రమించుకున్నారని ఆరోపించారు. జీవో నెం.217తో మత్స్యకారుల వృత్తికి ఉరితాడు బిగించారని.. NHDP పథకాలను రద్దు చేసి చేనేత వర్గాల వారికి కేంద్ర సబ్సిడీలు దూరం చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story