CM Jagan: నేడు రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్‌

CM Jagan: ఏపీలో రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, సున్నావడ్డీ సొమ్ము చెల్లింపు

Jyothi
Updated on: 28 Nov 2022 12:53 PM IST
CM Jagan Input Subsidy Money Will Be Deposit in Farmers Accounts Today
X

CM Jagan: నేడు రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్‌

CM Jagan: ఇవాళ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రైతుల అకౌంట్లలో నగదు జమచేయనున్నారు. లక్షరూపాయలలోపు పంట రుణాలకు వడ్డీ రాయితీ, విపత్తులతో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని ఏపీ ప్రభుత్వం అందించనుంది. దీంతోపాటు గతంలో సాంకేతిక కారణాలతో గతంలో చెల్లింపులు జరగని రైతుల ఖాతాల్లో కూడా నగదు జమచేయనుంది. దాదాపు 200 కోట్లపైగా నగదును సీఎం జగన్, నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45వేల 998 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతులకు బకాయి ఉన్న సున్నా వడ్డీ నగదును సైతం జమ చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story