రాజధాని మార్పుపై సీఎం జగన్ పరోక్ష వ్యాఖ్యలు

రాజధాని మార్పుపై సీఎం జగన్ పరోక్ష వ్యాఖ్యలు
x
జగన్
Highlights

రాజధాని మార్పుపై సీఎం జగన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఈ విధంగా మాట్లాడారు. గతంలో అన్యాయంగా నిర్ణయాలు...

రాజధాని మార్పుపై సీఎం జగన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఈ విధంగా మాట్లాడారు. గతంలో అన్యాయంగా నిర్ణయాలు తీసుకున్నారని గతంలో తీసుకున్న ఆ నిర్ణయాలను సరిదిద్దుతామని చెప్పారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు సీఎం జగన్.

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు 17వ రోజుకు చేరుకున్నాయి. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యానగర్‌ పార్క్‌ వద్ద నుంచి ఎన్టీఆర్‌ స్టేడియం మీదుగా కలెక్టరేట్‌ గేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించింది. మరో పక్క తుళ్లూరులో సకల జనుల సమ్మెలో భాగంగా వినూత్నమైన పోస్టర్లు అంటించారు షాపు యజమానులు. సకలజనుల సమ్మె సందర్భంగా షాపు తెరవబడదు అంటూ పోస్టర్లు అంటించారు. వీ వాంట్‌ అమరావతి అంటూ రాసిన పోస్టర్లను అంటించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories