Jagan: ఇవాళ పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం

Jagan: సార్వత్రిక ఎన్నికలపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం

Jyothi
Published on: 27 Feb 2024 9:20 AM IST
CM Jagan has a key Meeting with Party Leaders Today
X

Jagan: ఇవాళ పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం

Jagan: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు తమవ్యూహాలకు పదును పెడుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఇవాళ వైసీపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి సీకే కన్వెన్షన్ లో ఈ సమావేశం జరగనున్నది. 175 నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు హాజరు కానున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించాలని నేతలకు సీఎం జగన్ సూచించనున్నారు.

మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో ఆర్టినేటర్లకు పార్టీ ప్రతిష్టతపై గ్రౌండ్ లెవల్ లో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయనున్నారు సీఎం జగన్ జిల్లాల్లో పార్టీ నేతల మధ్య విభేదాలు పరిష్కరించుకుని.. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై మార్గ నిర్దేశం చేయనున్నారు. అలాగే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు..తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని నేతలకు సూచన చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story