CM Jagan: రేపు పోలవరం ప్రాజెక్టుకు ఏపీ సీఎం జగన్‌

CM Jagan: ప్రాజెక్టు పనుల పురోగతి క్షేత్ర స్థాయిలో పరిశీలన * జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష

Sandeep Eggoju
Updated on: 18 July 2021 6:46 PM IST
CM Jagan Going to Visit Polavaram Project Tomorrow
X

సీఎం జగన్ (ఇమేజ్ ది హన్స్ ఇండియా)

CM Jagan: ఏపీ సీఎం జగన్‌ రేపు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేస్తారు. ఇందుకోసం రేపు ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 11 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్నారు. ఇక మధ్యాహ్నం 2.15 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story