CM Jagan: ఈస్టర్ కారణంగా యాత్రకు బ్రేక్ ఇచ్చిన సీఎం జగన్

CM Jagan: సోమవారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్న యాత్ర

Shashank Gullapelli
Published on: 31 March 2024 8:17 PM IST
CM Jagan Gave A Break To The Yatra Due To Easter
X

CM Jagan: ఈస్టర్ కారణంగా యాత్రకు బ్రేక్ ఇచ్చిన సీఎం జగన్

CM Jagan: ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ముమ్మరం అయ్యింది. అధికార ప్రతిపక్ష నేతలంతా రోడ్ షోలు, బహిరంగ సభలతో జనంలో తిరుగుతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ద్వారా సీఎం జగన్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్ బస్సు యాత్ర శనివారం రాత్రికి అనంతపురం జిల్లా సంజీవపురంకి చేరుకుంది. కాగా ఆదివారం ఈస్టర్ కారణంగా బస్సు యాత్రకు జగన్ బ్రేక్ ఇచ్చారు. యాత్ర ఆగిన ప్రాంతం నుంచి సోమవారం సీఎం జగన్ బయలుదేరనున్నారు. పలు ప్రాంతాలు పర్యటిస్తూ సాయంత్రానికి కదిరికి చేరుకుంటారు. అక్కడ ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందులో జగన్ పాల్గొననున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story