టీడీపీ తీరుపై సీఎం జగన్ ఆగ్రహం

X
Highlights
రెండోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. టాపిక్ కాని టాపిక్‌ను తీసుకొచ్చి టీడీపీ...
Arun Chilukuri1 Dec 2020 6:27 AM GMT
రెండోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. టాపిక్ కాని టాపిక్‌ను తీసుకొచ్చి టీడీపీ ఎమ్మెల్యేలు సభలో అరవడమేంటని సీఎం జగన్ ఫైరయ్యారు. డిసెంబర్ 15న బీమా సొమ్ము ఇస్తామని చెప్పిన ఎందుకు రచ్చ చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని జగన్ అన్నారు. జగన్ మాట చెప్తే చేసి చూపిస్తాడు. విశ్వసనీయత అన్నది మనం చేసే పనుల వల్ల వస్తుంది. మాట చెప్తే నిలబెట్టుకుంటామనే భరోసాను ప్రజలను ఇవ్వగలిగాం. మేనిఫెస్టోలోని అంశాలను 90 శాతం అమలు చేశాం. బిల్లులపై చర్చ జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారు. టిడ్కోపై చర్చ జరగకూడదనే చంద్రబాబు గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి రెండు, మూడు స్థానాలు కూడా రావని సీఎం జగన్ అన్నారు.
Web TitleCM Jagan Fires on TDP MLAs in Assembly
Next Story