అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం జగన్ కాన్వాయ్

X
Highlights
CM convoy: పేషెంట్ ను తీసుకెళుతున్న ఓ అంబులెన్స్‌కు సీఎం జగన్ కాన్వాయ్ దారిచ్చింది. కడప జిల్లా...
Arun Chilukuri2 Sep 2020 7:36 AM GMT
CM convoy: పేషెంట్ ను తీసుకెళుతున్న ఓ అంబులెన్స్‌కు సీఎం జగన్ కాన్వాయ్ దారిచ్చింది. కడప జిల్లా పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం జగన్.. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తాడేపల్లిలోని నివాసానికి కారులో బయల్దేరారు. అదే సమయంలో గూడవల్లి నిడమానూరు మధ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని అంబులెన్స్ లో తరలిస్తున్నారు. ఇది గమనించిన సీఎం జగన్, అంబులెన్స్‌కు దారి ఇవ్వాలని సిబ్బందితో చెప్పారు. వెంటనే వారు దారి ఇచ్చారు. ఎలాంటి ఆటంకం లేకుండా అంబులెన్స్ ముందుకు కదిలింది. ప్రజలకు, ముఖ్యంగా అంబులెన్స్ కు ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా సీఎం కాన్వాయ్ వ్యవహరించడం, అంబులెన్స్ కు దారి ఇచ్చిన తర్వాతే సీఎం వైఎస్ జగన్ ముందుకుసాగడం.. ప్రజలకు ఇబ్బంది కలుగకూడదన్న జగన్ మానవీయ హృదయానికి, ప్రజానిబద్ధతకు నిదర్శమని దీనిని గమనించిన స్థానికులు తెలిపారు.
Web Titlecm Jagan convoy gives way to the ambulance
Next Story