logo
ఆంధ్రప్రదేశ్

సలాం కుటుంబసభ్యులను కలిసిన సీఎం జగన్

సలాం కుటుంబసభ్యులను కలిసిన సీఎం జగన్
X
Highlights

కర్నూలు జిల్లా నంద్యాలలో ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం కుటుంబసభ్యులను సీఎం జగన్ పరామర్శించారు. పుష్కరాల...

కర్నూలు జిల్లా నంద్యాలలో ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం కుటుంబసభ్యులను సీఎం జగన్ పరామర్శించారు. పుష్కరాల కోసం కర్నూలు వచ్చిన ఆయన ఏపీఎస్పీ అతిథి గృహం దగ్గర సలాం కుటుంబసభ్యలను కలిశారు. సలాం అత్త మాబున్నీసా ఆమె కుమారుడు శంషావళీ, కుమార్తె సాజిదాను ఓదార్చారు. ఆత్మహత్యకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు కోరారు. సలాం కుటుంబానికి అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. మాబున్నీసా కుమార్తెకు ఔట్‌సోర్సింగ్‌ కింద ఉద్యోగం ఇవ్వాలని అల్లుడు శంషావళిని అనంతపురం నుంచి నంద్యాలకు బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌ను ఆదేశించారు.

Web Titlecm Jagan consoles Abdul salam family Kurnool
Next Story