CM Jagan: ఇంత మంచి చేశామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు

CM Jagan: రాష్ట్రానికి మంచి జరగకుండా రాబంధుల్లా అడ్డుకుంటున్నారు

Rama Rao
Updated on: 13 May 2022 1:45 PM IST
CM Jagan Comments on TDP Chief Chandrababu | Telugu News
X

గత పాలన మన పాలన.. తేడా గమనించండి - సీఎం జగన్

CM Jagan: ప్రతిపక్షాలపై ఏపీ సీఎం జగన్ మరోసారి ఎదురుదాడికి దిగారు. మంచి చేశామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదని, చంద్రబాబు ఇంత మంచి పని చేశాడని చెప్పే ధైర్యం దత్తపుత్రుడికి లేదని ఫైర్ అయ్యారు. YSR మత్స్యకార భరోసా నిధులు విడుదల చేసిన జగన్.. 2019లో మేనిఫెస్టోలో చెప్పిన 95 శాతం హామీలను అమలు చేశామని చెప్పారు.

మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని జీర్ణించుకోలేరంటు చంద్రబాబు, పవన్‌లపై జగన్ మండిపడ్డారు. పరీక్షల పేపర్లు వీళ్లే లీక్ చేస్తారు. పేపర్ లీక్‌ను సమర్థించిన ప్రతపక్షాన్ని ఎక్కడైనా చూశారా..? అని ప్రశ్నించారు. కొడుక్కి పచ్చి అబద్ధాలు, మోసాలతో ట్రైనింగ్ ఇస్తున్న చంద్రబాబు లాంటి తండ్రిని ఎక్కడైనా చూశారా? అని జగన్ నిలదీశారు.

Rama Rao

Rama Rao

Next Story