అచ్చెన్నాయుడు రాజీనామా చేస్తారా? : సీఎం జగన్‌

అచ్చెన్నాయుడు రాజీనామా చేస్తారా? : సీఎం జగన్‌
x
జగన్‌
Highlights

టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడుపై సీఎం జగన్మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మద్యం షాపులను తగ్గిస్తాని చెప్పిన ప్రభుత్వం ఆ మాట తప్పిందని,...

టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడుపై సీఎం జగన్మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మద్యం షాపులను తగ్గిస్తాని చెప్పిన ప్రభుత్వం ఆ మాట తప్పిందని, అంతేకాకుండా రాష్ట్రంలో నాటు సారా అమ్మకాలు ఎక్కువయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చెబుతోన్న మద్య నిషేధం అంతా ఒట్టిదేనని రాత్రి తొమ్మిది దాటితే ఇంటికే మద్యం సరఫరా జరుగుతోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

దాంతో, సీఎం జగన్మోహన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. మద్యం పాలసీపై అచ్చెన్నాయుడు చెబుతున్న లెక్కలన్నీ తప్పని అన్నారు. ఆయన చెప్పిన లెక్కలు తప్పని తేలితే అచ్చెన్నాయుడు రాజీనామా చేస్తారా? అని సీఎం జగన్ సవాల్ విసిరారు. టీడీపీ నేతలు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం మండిపడ్డారు. అచ్చెన్నాయుడు నోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడుతున్నారని ఇలాంటి వ్యక్తి సభలో ఉండటానికి కూడా అనర్హుడంటూ నిప్పులు చెరిగారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అచ్చెన్నాయుడుపై సభాహక్కుల నోటీసును ఇస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories