సీఎం జగన్ కేసు..వాదనలు పూర్తి.. తీర్పు రీజర్వ్

సీఎం జగన్ కేసు..వాదనలు పూర్తి.. తీర్పు రీజర్వ్
x
Highlights

ఆస్తుల కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకు వ్యక్తిగత హాజరు మినహాయించాలని కోరుతూ.. సీఎం జగన్ ప్రత్యేక కోర్టులో పిటిషన్

ఆస్తుల కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకు వ్యక్తిగత హాజరు మినహాయించాలని కోరుతూ.. సీఎం జగన్ ప్రత్యేక కోర్టులో పిటిషన్దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ కూడా కౌంటర్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై శుక్రవారం కోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. జగన్ ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని, దీంతో ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని.. ప్రతి శుక్రవారం హైదరాబాద్ కు రావడం వలన ప్రజాధనం వృధా అవుతోందని జగన్ తరుపు న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు.

అలాగే సీబీఐ తరఫు లాయర్లు కూడా తమ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ప్రత్యేక కోర్టు.. నవంబర్ 1వ తేదీకి తీర్పు రిజర్వ్ చేసింది. మరోవైపు వాదనలు జరుగుతున్న సమయంలో జగన్ తరపు లాయర్.. జగన్ ను ఉద్దేశించి సీబీఐ న్యాయవాది వాడుతున్న భాష సరిగా లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ ఇప్పుడు సీఎం స్థానంలో ఉన్నారని... గౌరవనీయ ముఖ్యమంత్రి అని సంబోధించాలని సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories