Andhra Pradesh: అసంతృప్తి నేతలకు సీఎం జగన్‌ నుంచి పిలుపు

Andhra Pradesh: తన వద్దకు రావాలని అసంతృప్తి నేతలకు జగన్ కాల్

Rama Rao
Updated on: 11 April 2022 4:45 PM IST
CM Jagan Calls on YCP Disgruntled Leaders | AP News
X

Andhra Pradesh: అసంతృప్తి నేతలకు సీఎం జగన్‌ నుంచి పిలుపు

Andhra Pradesh: కొత్త కేబినెట్‌లో చోటు దక్కపోవడంతో పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నారు. కాసేపట్లో సీఎం జగన్‌తో బాలినేని శ్రీనివాసరెడ్డి సమావేశంకానున్నారు. ఇక అసంతృప్త నేతలతో చర్చించామని వారంతా అర్ధం చేసుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ పరంగా ముఖ్యమైన నేతలకు కేబినెట్ హోదాకు సమానమైన బాధ్యతలు అప్పగిస్తామన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వారికి బాధ్యతలు ఉంటాయన్నారు. ఇంకా కొన్ని జిల్లాలకు చెందినవారికి మంత్రి పదవులు దక్కలేదని సామాజిక సమీకరణాల బట్టే కేబినెట్‌లో చోటు కల్పించడం జరుగుతుందన్నారు సజ్జల.

Rama Rao

Rama Rao

Next Story