CM Jagan: ముగిసిన సీఎం జగన్ బస్సు యాత్ర

CM Jagan: 22 రోజుల పాటు సాగిన సీఎం జగన్ బస్సు యాత్ర

Shashank Gullapelli
Published on: 24 April 2024 9:52 PM IST
CM Jagan Bus yatra Is Over
X

CM Jagan: ముగిసిన సీఎం జగన్ బస్సు యాత్ర 

CM Jagan: సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటితో ముగిసింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో చివరి సిద్ధం సభతో ఈ యాత్ర ముగిసినట్లు వైసీపీ హైకమాండ్ ప్రకటించింది. ఇవాళ ఎచ్చెర్ల, టెక్కలి నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటన కొనసాగింది. కాగా అక్కివలస నుంచి మొదలైన బస్సు యాత్ర చిలకపాలెం జంక్షన్, ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం టౌన్ బైపాస్ మీదుగా కోటబొమ్మాళి వరకు బస్సు యాత్ర నిర్వహించారు. సీఎం జగన్ మొత్తం 22 రోజుల పాటు 86 నియోజకవర్గాల మీదుగా 2100 కిలోమీటర్ల మేర యాత్ర సాగించారు. 16 బహిరంగ సభలు, 9 రోడ్ షోలు , 6 ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. కాగా రేపు పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ జగన్ నామినేషన్ వేయనున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story