CM Jagan: ఇవాళ ఢిల్లీకి సీఎం జగన్

CM Jagan: సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ

Jyothi
Published on: 5 April 2022 7:48 AM IST
CM Jagan Arrives in Delhi Today
X

CM Jagan: ఇవాళ ఢిల్లీకి సీఎం జగన్

CM Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ప్రధాని నరేంద్రమోడీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి జగన్ తెలుపనున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలను సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రారంభించారు. నూతన జిల్లాల ఏర్పాటు విషయంపై ప్రధాని దృష్టికి సీఎం జగన్ తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్, పునర్విభజన చట్టంలోని వెనుకబడిన జిల్లాకు నిధులపై మోడీ చర్చించే అవకాశాలు ఉన్నాయి.

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు కావాల్సిన నిధుల విషయంలో మోడీ వద్ద జగన్ ప్రస్తావించున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి అమిత్ షాతోనూ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమిత్ షాతో భేటీకి సీఎంవో అపాయింట్ మెంట్ కోరింది

Jyothi

Jyothi

Next Story