గ్యాస్‌ లీక్‌ ఘటనపై సీఎం జగన్‌ ఆరా.. తీవ్రంగా పరిగణించాలని ఆదేశాలు

Gas Leakage: అనకాపల్లి గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు సీఎం జగన్‌ ఆదేశించారు.

Arun Chilukuri
Published on: 3 Aug 2022 4:06 PM IST
CM Jagan Appointed High-level Team to Investigate the Gas Leakage Incident
X

గ్యాస్‌ లీక్‌ ఘటనపై సీఎం జగన్‌ ఆరా.. తీవ్రంగా పరిగణించాలని ఆదేశాలు

Gas Leakage: అనకాపల్లి గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు సీఎం జగన్‌ ఆదేశించారు. అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో గ్యాస్‌ లీక్‌ వ్యవహారంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన బాధితులకు అందుతున్న వైద్య సహాయంపై ఆరా తీశారు. గ్యాస్‌ లీక్‌ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని అధికారులను సూచించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో కూడా సేఫ్టీ ఆడిట్‌ జరిపించాలని ఆదేశించారు సీఎం జగన్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story