విశాఖ పర్యటనలో ట్రాఫిక్‌ ఆంక్షలపై సీఎం తీవ్ర అసంతృప్తి

Visakhapatnam: అధికారుల తీరుపై సీఎం జగన్ ఆగ్రహం... ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురిచేశారన్న సీఎం జగన్‌.

Sriveni Erugu
Published on: 10 Feb 2022 10:04 AM IST
CM Dissatisfied With Traffic Restrictions During His Visit To Visakhapatnam
X

విశాఖ పర్యటనలో ట్రాఫిక్‌ ఆంక్షలపై సీఎం తీవ్ర అసంతృప్తి

Visakhapatnam: నిన్నటి విశాఖ పర్యటనలో ట్రాఫిక్‌ ఆంక్షలపై ఏపీ సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై సీరియస్ అయ్యారు. ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురిచేశారన్న సీఎం జగన్‌ ప్రశ్నించారు. గంటల తరబడి ట్రాఫిక్ ఎందుకు నిలిపివేశారని అడిగారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని అధికారులను ఆదేశించారు. ఇక విశాఖలో ట్రాఫిక్ జామ్‌, ఇతర అసౌకర్యాలపై విచారణ చేపట్టాలని డీజీపీకి సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story