Chandrababu Naidu Davos Visit: దావోస్‌లో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన.. పెట్టుబడులపై కీలక చర్చలు

Chandrababu Naidu Davos Visit: దావోస్‌లో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన.. పెట్టుబడులపై కీలక చర్చలు
x

Chandrababu Naidu Davos Visit: దావోస్‌లో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన.. పెట్టుబడులపై కీలక చర్చలు

Highlights

Chandrababu Naidu Davos Visit: దావోస్‌లో సీఎం చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటనలో సీఐఐ సమావేశంలో పాల్గొని ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించనున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు.

Chandrababu Naidu Davos Visit: వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌లో ఉన్న ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటనలో కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలపై సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) నిర్వహిస్తున్న సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ విధానాలు, పెట్టుబడిదారులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు వంటి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం ఐబీఎం, గూగుల్ క్లౌడ్ సీఈఓలు, జేఎస్‌డబ్ల్యూ, మేర్స్‌క్ సంస్థల అధినేతలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.

అదేవిధంగా ‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్’ అంశంపై నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొని, రాష్ట్రంలో వ్యాపారోత్సాహక కార్యక్రమాలపై తన దృక్పథాన్ని వివరించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories