CM Chandrababu: శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీపై సీఎం చంద్రబాబు సమీక్ష

CM Chandrababu: శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ.. శివస్వాములపై లాఠీఛార్జ్‌ వివాదాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

Arun Chilukuri
Published on: 10 Feb 2026 3:43 PM IST
CM Chandrababu: శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీపై సీఎం చంద్రబాబు సమీక్ష
X

CM Chandrababu: శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ.. శివస్వాములపై లాఠీఛార్జ్‌ వివాదాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ నుంచి మంత్రులు, సీఎస్‌, డీజీపీలతో రివ్యూ చేశారు. జిల్లా అధికారులు శ్రీశైల క్షేత్రంలో తీసుకున్న చర్యలను సమీక్షించారు. మంత్రులు ఆనం, అనిత భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. భక్తులకు వసతి కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. దీక్షలు వేసుకుని... కష్టపడి ఆలయానికి చేరుకునే భక్తులను అగౌరవపరిచేలా ఎవరూ వ్యవహరించొద్దని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు. శివరాత్రికి ఇబ్బందులు జరగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story